A little personal and a little political

మూర్ఖభక్తా మేలుకో

నిన్న నిత్యానందా, మొన్న మూరత్ ద్వివేది. ఆది గురువు పుట్టపర్తి వుండనే వున్నాడు. దేవున్ని చుడాలని అందరికీ వుంటుంది. కానీ కాషాయం కట్టుకున్న ప్రతీ ఒక్కడినీ దేవుడు అనుకుంటే ఎలాగా? ఒప్పుకుంటా, ప్రశ్నించడం సులువే…. మరి దొరికే వరకూ అందరూ దేవుళ్ళే కదా, అని మీరు అనవచ్చు.

దొంగ బాబాలు మనకు క్రొత్త కాదు. మరి ఎందుకు ఇంత మంది మొసపోతున్నారు?

నమ్మకం ముదిరితే వ్యసనం

మానవుడిని ముందుకు నడిపించేది నమ్మకం. ఆ నమ్మకం కృష్ణుని మీద కావచ్చు, అల్లా, ఏసు మీదా కావచ్చు. కొంత మంది  దేవున్ని కాకుండా డబ్బుని లెదా మరి దేనైనా నమ్మవచ్చు, ఏది ఏమైతేనేమి బ్రతకటానికి తిండి ఎంత ముఖ్యమో నమ్మకం కూడా అంతే ముఖ్యం అంటాను.

మన ప్రపంచంలొ చాలా మంది దేనిని నమ్మాలో, ఎందుకు నమ్మాలో తెలియదు. వాళ్ళు ఎందుకు బ్రతకాలొ కూడా తెలియదు. కనపడని దేవుని కన్నా కనపడే దేవుడే మిన్నా అనుకుంటారు. గుడిలో ప్రసాదం కన్నా బాబా చేతి సున్నం ఇష్టపడతారు. ఎదైనా బాగా ముదిరితే వ్యసనం అవ్వుతుంది. దొంగ బాబాని గుడ్డిగా నమ్మితే కొంపే ముంచుతుంది.

తాగుడు వ్యసనం తలకి ఎక్కిన వాళ్ళు డబ్బులు తగలేసినట్లు, బాబా ఆవహించిన వాళ్ళు ఇల్లు, వళ్ళూ కూడా తగలపెట్టుకుంటారు. బాబా ఎక్కడికి వెళ్తే అక్కడికి వళ్తారు. అడక్కండానే దారపోస్తారు. వీళ్ళకి జగమంతా బాబామయం. బాబాని నమ్మని వాళ్ళంతా పిచ్చిజనం.

బాబాలు బాబోయ్ బాబాలు

ఎటు చూసినా దొంగ బాబాలు, జాతకాలు చెప్పెవాళ్ళు, దేవున్ని చూపించే  వాళ్ళు, తామే దేవున్ని అని చెప్పెవాళ్ళు. గుడి పేరు చెప్పుకు చేసేవాళ్ళు కొందరు, చర్చి పేరు చెప్పుకు చేసేవాళ్ళు మరి కొందరు. వారణాశి నుంచి వేటికన్ దాకా అదే గోల. అసలు ఈ బాబా కధ ఏమిటి?

నల్ల బట్టల్లొ చేస్తే అది ఇంద్రజాలం. కాషాయంలొ చేస్తే అది దేవుని లీల. ఈ మాయకి పిచ్చి వాళై జనం వెంట పడుతుంటారు. రాజకీయవేత్తలు కూడా ఆ జనం వోట్లకు బాబా భక్తుల్లాగా నటిస్తుంటారు. ఈ బాబాలు, స్వాములు కోట్లకు పడగలెత్తినారు. వారికి ముట్టె విరాళాలకి లెక్కా వుండదూ, పన్నూ వుండదూ. ఇది చాలదు అన్నట్లూ, వ్యభిచారం ‘నిత్య’కృత్యం. అంతే కాదండోయ్ అమ్మయిల సరఫరా, హత్యలు, కిడ్నాపులు, దొంగ నోట్లు, ఇవి అన్నీ ఎంత పెద్ద బాబా అయితే, అంత ఎక్కువ అన్నమాట.

మార్గమే లెదా?

మరి మంచి వాళ్ళే లెరా? అలా అనటం లేదు లేండి. ఒక్కటి గుర్తు పెట్టుకోండి. దేవున్ని ప్రకృతిలొ, సాటి మనిషిలో, జంతువుల్లొ చూడండి. అంతెగానీ బాబాల్లో, వుంగరాల్లొ చూడకండి. మంచి ఎవరు చెప్పినా వినండి, కాని దానికి డబ్బులు ఇచ్చి వెలకట్టకండి. మీ డబ్బు మీద మీకు ఎంత హక్కు వుందో, అది తప్పుడు చేతిల్లోకి వెళ్ళకుండా అంతే బాద్యత మీపై వుంది.

సత్యమేవ జయతే.

Advertisements

5 comments on “మూర్ఖభక్తా మేలుకో

 1. Krishnaiahasr( O telugodu )
  April 8, 2010

  Babala gurinchi neeu racindi chala bagundi.

 2. Srini Yeramati
  April 9, 2010

  Thoughtful and Convincing article for the blind believers.

 3. శ్రవణ్
  May 7, 2010

  మనిషిని దేవుడిగా చూడడం ఏంటండీ? ఉదా: సత్యసాయిబాబా (ఆయన పేరు నాకు తెలీదు) తనైనా దేవుణ్ణి కాను అని చెప్పివుంటే లేదా దేవుణ్ణి అని నిరూపించుకుంటే గౌరవమైనా ఇచ్చేవాణ్ణి. అసలు మన లీడర్లను అనాలి.

  • upardhasaradhi
   June 17, 2011

   Sravanji, on Saibaba, I have a different view. There may be variety of stories how he became famous, but for me, once he became famous and starting getting donations, wt he did with those donations is interesting & important.

   As a matter of fact he was a very good Social Worker, who helped so many poor patients to get proper treatment for their ailments, who cannot imagine for such medical treatment through his trust. His educational Trust is doing very good service to the society. His motivation made many human being to turn into social worker.

   I too is not a keen follower of Him,but I have admired Him for His influence and contribution to the society.

   In Hindu Mythology there is a bird named Hansa Pakshi, If you give water mixed milk to that, it will drink only milk and it will keep the water back on the cup and it has the power to separate the Milk and water mixed together. Like that we must take the good thing only and leave the bad thing. not many ppl do wt Sai baba did as a social worker, on other parts, lets leave, he is dead and cant explain to our criticisms today. 🙂

 4. upardhasaradhi
  June 17, 2011

  good one ,especially ur end foot note about good ppl is good. In any religion, BABAs, mullaahs or Priest r only there to tell what is good or what is bad; its upto the individuals to understand and apply to their own life and to decide whether to practice or not. No one neither forcing us to go to BABAs nor asking to pay money, its us we r going and paying , it cld be beleif, arrogance or wt u call as “MOOD ABHAKTHI”.

  For Ex, at the time of Eclipse, astrologers said pregnant women slhdnt go out; however some others says there is no such thing, u can go and C the eclipse with no doubt. but at the same time, there r practical theories where ppl have shown the side effects of Pregnant woman going out and gave birth to abnormal babies. Whom to beleive? our ancient myth or scientific rule or both? Its upto individulas. 🙂

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

Information

This entry was posted on April 8, 2010 by in From the street, India, Politics, Telugu.
%d bloggers like this: