A little personal and a little political

మా తెలుగు తల్లికి మల్లెపూదండా…

( ఎందరో మహానుభావులు – మొదటి భాగం )

చదువుల సరస్వతులు, రాజ్యాలేలిన రాణులు, కవితలతో కడుపునింపిన కవయిత్రులు, బ్రిటీషొల్లని బెదరగొట్టినోళ్ళు. ఆడవారిని కీర్తించకుండా తెలుగు చరిత్ర రాయనగునా? తెలుగు……తెల్లబొదూ? అందుకే ఈ “ఎందరో మహానుభావులు” శీర్షిక మన తెలుగు తల్లులతోనే మొదలు పెడుతున్నా.

రాజా? రాణా?…

”నాకు ఆ గుర్రం ధూళిలొ కనిపించడం లేదు, డెక్కల శబ్ధంలొ వినిపించడం లేదు. వచ్చేది రాజా? రాణా?” శత్రు సైనికులు చెవులు కొరుక్కుంటున్నారు. రుద్రమ్మ మాట వినగానే వారికి ముందుకు ఉరకాలొ వెనక్కి పరగాలొ అర్ధం కాలేదు.

గణపతి దేవ మహారాజు కాకతీయుల్లొ ఉత్తమునిగా కీర్తింపబడతాడు. ఆయన తెలుగు వారినందరిని ఒక్కతాటిపై తెచ్చిన, రామప్ప దేవాలయం నిర్మించిన ఘనులు.  కుమార్తె రుద్రమ్మ దేవిని కొడుకులా పెంచి, పట్టాభిషేకం చేశారు. రాణి రుద్రమ్మ దేవి పాలనలో ప్రజలు సుఖసాంతులతో జీవించారు. మార్కొ పోలొ, ఒక ఇటలీ యాత్రికుడు వినీస్ నుండీ చైనా వెళ్తూ ఓరుగల్లుని సందర్శించాడు. ఆయన మాటల్లొ చెప్పాలంటే, ప్రజలు రాణి రుద్రమ్మని దేవుని కంటే ఎక్కువగా కొలిచారు.

రాణి రుద్రమ్మ దేవి తండ్రి మొదలు పెట్టిన ఓరుగల్లు కోటని పూర్తి చేసింది. పాండ్య, కలింగా, యాదవల నుండి తన రాజ్యాన్ని, ప్రజలనీ కాపాడింది. ఆడదే కదా అని చులకనగా దండయాత్ర చేసిన వాళ్ళని స్వయంగా యుద్ద రంగంలో తరిమి కొట్టింది. యుద్దంలొ వచ్చిన సిస్తుని కూడా అలసి సొలసిన అండగా నిలిచిన సైన్యంకి పంచింది.

పదహారణాల రామాయణం

తిక్కన్నా, పోతన్నా అప్పటికే రామాయణన్ని తెలుగులొ రాశారు కదా అన్నవారికి మొల్ల ఏమన్నదో తెలుసా? ….. రోజూ తింటున్నామని తినటంమానేస్తామా, రాముని చరిత కూడా అంతే, ఎంత విన్నా, చదివినా, రాసినా తనివిరుతుందా?

ముందు రాసిన వారిలా కాకుండా, మొల్ల రామాయణన్ని వాడుక బాషలొ రాయటంవల్ల చాలా మందికి చేరువ అయింది. మొల్ల శైలి చాలా సరళమైనది మరియు రమనీయమైనది అని ప్రసిధి.  మొల్ల రామాయణం ఆరు కాండములలో 138 పద్యములతో కూడుకున్నది. ఈ కావ్యమును మొల్ల కేవలం ఐదు రోజులలో రాసింది అంటారు.

ఆమెకు తండ్రి అంటే అమిత ప్రేమ. రామాయణం మొదటి పద్యములలోనే తండ్రి శివ భక్తి గురించి ప్రస్థావించింది. మొల్ల తన రామాయణన్ని వెరే కవుల వలే ఏ రాజుకీ అంకితం ఇవ్వలేదు. రాముడు అంటే ఆమెకు అంత భక్తి. కృష్ణ దేవరాయుని ఆస్థానంలో మొల్ల తన రామాయణం వినిపించి, అందరిని మెప్పించింది.

కోకిలంటారని మొసపోకండి

సరోజినీ నాయుడు అంటే మనకు ముందు స్వాతంత్ర సమర యొధురాలుగా గుర్తుకు వస్తుంది. కాని సరోజినీ గురించి చెప్పాలి అంటే చాలా వుంది (నేను కొంచమే చెప్తానులేండి).

సరోజినీ తండ్రి అఘోరనాథ్ చటోపాధ్యాయ నిజాం కాలేజీ స్థాపకుడు, శాస్త్రవేత్త మరియు తత్వవేత్త. తల్లి బరదా సుందరి దేవి ఒక కవయిత్రి. గొప్ప కుటుంబం నుంచి వచ్చిన సరోజినీ చిన్నప్పటి నుండీ బడిలో మొదటగా నిలిచేది. 16 ఏళ్ళకే లండన్ కి పై చదువులకి వెళ్ళింది. ఆ కాలంలొనే కులాంతర ప్రేమ వివాహం చేసుకున్న దైర్యవంతురాలు.

స్వాతంత్ర సమరంలొ గాంధిగారి ప్రక్కనే వుండి ఎన్నో ఉధ్యమాల్లొ పాల్గొన్నారు. ఒకసారి మహాత్మ సరోజినీని సలహా అడగటానికి స్నానాల గది బయట వేచి వునారు అని ఎక్కడో చదివాను. సరోజినీ 5 బాషల్లొ మట్లాడేవారు. “ది గోల్డెన్ త్రెషోల్డ్, “ది బర్ద్ ఆఫ్ టైం ఆమె వ్రాసిన ఎన్నో ఆంగ్లం కవితల్లొ రెండు. సరోజినీ నాయుడు భారత జాతీయ కాంగ్రేసు తొలి మహిళా అధ్యక్షురాలు మరియు స్వతంత్ర భారత దేశపు తొలి మహిళా గవర్నరు కూడా.

దుర్గాభాయ్ దేశ్‌ముఖ్, బండారు అక్కమాంబ ఇల చెప్పుకుంటూ పోతే చాలా మంది తెలుగు తల్లులు వున్నారు. పరిధిని బట్టీ ఈ శీర్షిక ఈ భాగం ఇక్కడితో ముగిస్తున్నాను.

ఇన్తైస్ త్రీన్గౌర వించన్వా డుగ్గాడి దల్ఛక్రీ

Advertisements

3 comments on “మా తెలుగు తల్లికి మల్లెపూదండా…

 1. సనారాజు
  April 15, 2010

  చాలా బావుంది.చిన్నప్పుడు కొర్రపాటి వారి రామప్ప గుడి చదివాను .దానిలో రుద్రమ దేవి,రామప్ప గుడి అంశాలు బాగా చెప్పారు.నా బ్లాగ్ లో రామప్పగుడి ఫొటోస్ ఉంచాను.
  ధన్యవాదాలు.
  సనారాజు

 2. Krishnaiahasr( O telugodu )
  April 15, 2010

  Chala baga vrasao. i am really very happy.

 3. Sriram
  April 17, 2010

  Good going. Hope to see more posts from you. Sorry, I checked your comments a bit late.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

Information

This entry was posted on April 14, 2010 by in History, India, Politics, Telugu.
%d bloggers like this: