A little personal and a little political

రైతే భిచ్చగాడు.

మన ప్రభుత్వం ధాన్యానికి ఇచ్చే కనీస  మద్ధత్తు ధర ఎప్పుడూ గిట్టుభాటు ధర కన్నా తక్కువే వుంటుంది. ఇది సత్యం. దీనికి మూడు కారణాలు…

  1.  మన దేశంలొ ధాన్యానికి అతిపెద్ద కొనుగోలుదారి Food Corporation of India (FCI). అంటే మన  ప్రభుత్వం అన్న మాట. మరి కొనుగోలుదారుడు ఎప్పుడూ రేటు తగ్గాలి అనే చూస్తాడు కాని పెంచుదాము అని చూడడు కదా? మరి ధాన్యాం ప్రభుత్వం కొనేది మద్ధత్తు ధర లేకే అని అనుకుంటే అది అమాయకత్వం. మరి Rs 2 kg బియ్యం ఇవ్వటానికి బోలెడు ధాన్యాం కావాలి కదా? ఎగుమతులు మీద నిషేధం కూడ అందుకే. ఒక్క మాటలో చెప్పాలి అంటే ధాన్యాం మీద ప్రభుత్వానికి monopoly వుంది.
  2.  ప్రభుత్వానికి కావలిసిందే రైతు ధర కోసం అడుక్కోవటం. ఒకసారి గిట్టుభాటు ధర యిస్తే ఇక యెమైనా వుందా? రైతుకి కొమ్ములు వచ్చి పెద్ద పెద్ద ప్రశ్నలు వేస్తాడు. ఎగుమతులు మీద నిషేధం, కల్తి విత్తనాలు, ఇన్సురెన్సులో అవకతవకలూ, . వీటి గురించి అడుగితే ఏమి చెప్పాలి? ఒకొక్క ప్రశ్నా ఒకొక్క స్కాము. గిట్టుభాటు ధర ఇవ్వనంత వరకూ వొడ్డున పడ్డ చాప లాగ కొట్టుకుంటాడు.
  3. అసలు గిట్టుభాటు ధర ఎందుకు ఇవ్వాలి? ఉధ్యొగులకు జీతాలు తగ్గిస్తే ఆంద్ర, తెలంగాణా ఉధ్యొగులు తోడు దొంగలు లాగా కలిసిపోయి పోరాడారు. జు. డా. లని చూడండి….మనిషి పోయినా పర్వాలేదు… ప్రభుత్వం దిగి రావలసిందే. మరి మన రైతులు అలా కలిసి పోరాటం చెయ్యటం చూసారా? రాత్రి, పగలూ ఎండనకా, వాననకా కష్టపడతాడు, ఆకలితో పడుకుంటాడు (చస్తాడు) కానీ, తన కోసం పోరాడటం చేయటం తెలియదు. కులం పేరు మీద విడిపోవటం తెలుసు, రాజకీయ నాయకుల దగ్గర దగాపడటం తెలుసు, కానీ ఎవరయినా ముందు వుండి నడిపిస్తే కలిసి నడవటం తెలియదు.

రైతే రాజు అని నిన్ను మొసం చేసారు అన్నా. నీకన్నా భిచ్చగాడు నయం. వాడికి పెట్టబడీ వుండదు, నష్టమూ వుండదు. రైతన్నా…నిన్ను బతకనివ్వరు అన్నా…. నీ రక్తం పీలుస్తున్న జలగల్ని నీ చుట్టతో నిప్పెట్టన్నా.

Photo Source: Ramanjaneyulu Gv

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Information

This entry was posted on June 23, 2011 by in Corruption (Anti), farmers, India, Politics, Telugu.
%d bloggers like this: