A little personal and a little political

తెలంగాణ ఉధ్యమం – ఒక (సీమాంధ్ర) NRIఆలోచన.

తెలంగాణ తమ్ముల్లాకి/చేలేళ్ళకి (లేదా అన్నలకి/అక్కలకి) అన్యాయం జరిగింది. వాళ్ళకి చెప్పింది ఒకటి, చేసింది ఒక్కటి. ఒక్కసారి కాదు, రెండు సార్లు కాదు. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి చాలా సార్లు అయ్యింది. చాలా ఒప్పందాలూ, జీఓలు అయ్యినాయి. నీటి ప్రొజెక్ట్టుల్లో అన్యాయం జరిగింది, అభివృద్ధిలో అన్యాయం జరిగింది. ఉధ్యోగాల్లో అన్యాయం జరిగింది, గుర్తింపులో కూడా అన్యాయం జరిగింది. అభద్దాలు చెప్పిందీ, అన్యాయం చేసిందీ politicians. సీమాంధ్రలో యెక్కువ    మంది వున్నారు కాబట్టి వాళ్ళే అన్యాయం చేశారు అనుకుందాం.

ముందు          నేను యే ప్రాంతం వాడినో చెప్పనివ్వండి. నేను రెండవ తరగతి వరకు గుంటూరులో, 3, 4 మండపేటలో, పది వరకూ కాకినాడలో చదువుకున్నా. ఇంజినీరింగ్ పూర్తి అయ్యే సరకి తిరుపతీ, విజయవాడ, కర్నూలూ, హైదరాబాద్ కూడా పూర్తి చేశాను. అప్పటి నుండి అమెరికానే.

భాష: తెలంగాణ వాళ్ళు బాషని యెగతాళి చేస్తున్నారు అంటారు. నేను తెలంగాణలొ వున్నది తక్కువే. అయినా నేను యే వూరు వెళ్తే అక్కడ నా భాషని అవహేళన చేశారు. చివరకి నేను పండుగ సెలవలకి కాకినాడ నుండి రాజోలు వెళ్ళి వస్తే (రెండు వూళ్లు ఒకే జిల్లా) నా భాష మారింది అని కామిడీ చేసేవారు. కాకినాడ నుండి తిరుపతీ వెళ్తే కామిడీ చేశారు, తిరుపతీ నుండి విజయవాడ వెళ్తే కామిడీ చేశారు. అమెరికాకి వచ్చిన తర్వాత మన ఇంగ్లిష్ యాసని ఇక్కడ వాళ్ళు కామిడీ చేశారు. అది తప్పదు అనుకోండి, కానీ ఇక్కడ కూడా మనలానే, నార్త్, సౌత్, వెస్ట్, ఈస్ట్ యాసలు; అందరూ ఇంగ్లిష్ మాట్లాడినా, నార్త్ వల్ల భాషే కరెక్ట్; అది ఇంగ్లాండ్ ఇంగ్లిష్ వాళ్ళు యెదురు పడేవరకే అనుకోండీ.

అభివృద్ధి: మొత్తం మీద ఆంధ్ర ప్రాంతంలో          యెక్కువ అభివృద్ధి జరిగింది అనవచ్చు. కానీ అదీ గుడ్డిలో మెల్ల మాత్రమే. రాయలసీమ అంటే అక్కడ రత్నాల కన్నా రాల్లే యెక్కువ (of course). రాజకీయ నాయకులు మీ ప్రాంతంలో యేలా మోసం చేశారో, మిగతా ప్రాంతంలో కూడా అలానే మోసం చేశారు. ఆంధ్రలో పంటలు బ్రమ్మండముగా పండుతాయి. లాభం యేమిటి? మా రాజకీయ నాయకుల దెబ్బకి క్రాప్ హాలిడే ప్రకటించుకోవలసి వచ్చింది. వాళ్ళ కష్టాలు వింటే కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి.

పదవులు: ప్రాంతవారి పక్షపాతం డౌట్ లేకుండా వుంది. దానికి మించిన పక్షపాతం ఏమిటి? కులతత్వం. తెలంగాణలో బి‌సిలు యెక్కువ. సీమాంధ్రలో రెడ్డి+కమ్మ+రాజులు యెక్కువ. నాకు తెలిసి కులతత్వానికి ప్రాంతీయత తోడవటం తెలంగాణ వారిని ముంచింది.

నీటి ప్రొజెక్ట్టులు: తెలంగాణ వారికి అన్యాయం జరిగింది. అంతకన్నా ఏమి చెప్పలేను (తెలియదు).

ఉధ్యోగాలు: తెలంగాణ వారికి అన్యాయం జరిగింది. అంతకన్నా ఏమి చెప్పలేను (తెలియదు).

గుర్తింపు: ఇది దారుణం. తెలంగాణ విమోచన/విలీన దినం రాష్ట్ర ప్రభుత్వం చేయటానికి నొప్పి యేమిటి? అలానే కవులనీ, కళాకారులని గుర్తిస్తే తప్పు ఏమిటి?

ఉధ్యమ శైలి: ఉధ్యమం యెంత ముఖ్యమమో ఉధ్యమ నాయకత్వం అంత ముక్యం. కే‌సి‌ఆర్ ఒక అవకాశవాదిగా కనిపిస్తాడు. కే‌టి‌ఆర్ ఒక ఆవేశపరుడుగా కనిపిస్తాడు. కొంచం ఆలస్యం అయ్యినా, ప్రజలు (విద్యార్ధులు) ఉధ్యమ నాయకత్వం తీసుకున్నారు. కోదండరాం వున్నవాళ్లలో బెస్ట్, కానీ కొంచం టి‌ఆర్‌ఎస్     తొత్తులాగా మాట్లాడతాడు. టి.టి‌డి‌పి, టి.కాంగ్రెస్ వాళ్ళు తెలంగాణ వాళ్ళు కాదా? వాళ్ళు టి‌ఆర్‌ఎస్ లో కలవక పోతే ద్రోహులేనా?

SKC 8th chapter, మిలియన్ మార్చ్, జే‌పిని, పాలడుగుని అసెంబ్లి లో కోటించటం వంటివి తెలంగాణ ఉధ్యమంలో చీకటి ఘట్టాలు. వాటిని అన్నీ ప్రాంతాల వారు ఖండించారు (కే‌టి‌ఆర్ జే‌పిని కొట్టటం సమర్ధించాడు అనుకోండీ). SKC 8th chapter రాయించింది సీమంద్రులు కారు. రేపు సీమంద్రులు ఉధ్యమం  చేస్తే అదే 8th chapterతో అణిచి వేస్తారు మన రాజకీయ నాయకులు.

సకల జనుల సమ్మె నేను అనుకున్నదానికన్న మంచిగా అవ్వుతుంది.

నా పరిష్కారం: సమశ్య వాస్తవం. పరిష్కారం సంభవం. ఒక పది సంవత్సరాల ప్రణాళిక వెయ్యండి. ప్రతీ ఆరు నెలలకీ కోలమానానికి మైలురాయి పెట్టండి. ఒక సుప్రీం కోర్ట్ జడ్జ్, తెలంగాణ నాయకుల సమక్యంలో ఒక మానిటరీ కమిటీ వెయ్యండి. ఒక వేళ ఆ గతిన ప్రోగ్రెస్ అవ్వక పోతే, తెలంగాణ రాష్ట్ర ప్రక్రియ ప్రారంభించే అధికారం వాళ్ళకే ఇవ్వండి. ముందు కమిటీలు పని చేయలేదు కాబట్టీ, ఈ కమిటీకి విశేష అదికారాలు (తెలంగాణ రాష్ట్ర ప్రక్రియ ప్రారంభించే అధికారం) ఇవ్వండి.

తెలంగాణ ఉద్యమం వల్ల మిగతా ప్రాంతాల వాళ్ళకి కూడా మంచే జరుగుతుంది. ఉద్యమం వర్ధిల్లాలి.

Advertisements

16 comments on “తెలంగాణ ఉధ్యమం – ఒక (సీమాంధ్ర) NRIఆలోచన.

 1. Goutham Navayan
  September 19, 2011

  మీ పరిశీలన చాలా వరకు వాస్తవికంగా, నిజాయితీగా వుంది.
  మీరు సూచించిన పరిష్కారానికి ఇప్పుడు అవకాశం లేదు. ఇన్ని ఉల్లంఘనలు, ఇన్ని అన్యాయాలు,
  ఇన్ని మోసాలు జరిగిన తర్వాత తెలంగాణలో ఎవ్వరూ ప్రత్యెక తెలంగాణా ఏర్పాటు తప్ప మరో
  ప్రత్యామ్నాయాన్ని అంగీకరించే పరిస్థితి ఏమాత్రం లేదు.
  టి.టి‌డి‌పి, టి.కాంగ్రెస్ వాళ్ళు తెలంగాణ వాళ్ళు కాదా? వాళ్ళు టి‌ఆర్‌ఎస్ లో కలవక పోతే ద్రోహులేనా?<<<
  అన్నారు.
  టీ ఆర్ ఎస్ లో కలవకపోతే అనడం మీ గడుసు తనమా లేక అమాయకత్వమా తెలియదు.
  వాళ్ళని ఎవరూ టీ ఆర్ ఎస్ లో కలవ మనడం లేదు — తెలంగాణాకోసం ప్రజలతో కలసి నిజాయితీగా ఉద్యమించండి అంటున్నారు.
  రెండు నాలుకలు, రెండుకళ్ళ డ్రామాలు, ఆడకండి అంటున్నారు.
  వాళ్ళ జిత్తులమారి మేకవన్నె పులి పోరాటాలను అందరూ గ్రహించారు కాబట్టే వారిని ద్రోహుల్లా చూస్తున్నారు.
  మిగతా అంతా ఒకే

  • atluris
   September 19, 2011

   Thanks for your feedback Gautam. I am open to correct my analysis, but you only added to what I was saying about T.TDP and T.Congress. You generalized that these folks are not honest to the movement. You said they are following two eyed principles. But if they are only demanding Telangana, where is the two eye? Their leaders have two eye principle, because they are afraid of both sides, and they are not even “leading” anyone.
   Now if they want to stay in politics, and if you are saying they are not being honest by continuing in these two eyed parties, what choice is there, except joining TRS?
   And how can you say TRS is honest but not other two party leaders of TG? TRS is the only party in entire AP with single item agenda. It is not fair to expect same from other party leaders.

 2. Sreekumar
  September 19, 2011

  Good one! ఏడేళ్ళ క్రితమే తెలంగాణా కు ఓ మంచి ప్యాకేజీ ఇచ్చి వుంటే ఇవ్వాళ అసలు ఇంత వరకు వచ్చేదే కాదు.

 3. jaya vindhyala
  September 19, 2011

  To,
  SONIAJI AND OTHER CORE COMMITTEE MEMBERS,
  YOU MUST FEEL IN DEMOCRATIC WAY AND RESPECT ASPIRATIONS OF TELANGANA PEOPLE AND DONT LOOT ANY THING FROM TELANGANA AREA BY IN DIFFERENT MANNERS WITH POLICE FORCE. IF YOU HAVE COURAGE, PLEASE COME TO TELANGANA AREA AND LISTEN THEIR HEART BEAT HOW THEY ARE EXPLOITED AND EXPLOITING BY SEEMANDHRA MIGRANT LEADERS, LAND GRABBERS, JOB GRABBERS, WATER GRABBERS, MINERAL GRABBERS ETC.
  PLEASE LIFT POLICE FORCE FROM TELANGANA AREA AND SAVE RIGHTS OF INNOCENT TELANGANA PEOPLE AND OBEY LEGITIMATE DEMAND “RECONSTRUCTION OF TELANGANA STATE” LIKE FROM 17-09-1948 TO 1959.
  THIS IS ONLY SAVE TO CONGRESS PARTY, OTHERWISE, THE WORLD DIAS ARE OBSERVING YOUR UNDEMOCRATIC METHODS AND THEY MAY BE SUPPORT TELANGANA CAUSE IN DEMOCRATIC WAY, IT WILL BE PAINFUL TO YOU,….
  WE ARE DEMANDING YOU, REGISTERED CASES AGAINST POLICE OFFICIALS ( ON ALL TYPE OF POLICE CADRE ) WHO ARE VIOLATING POLICE CODE AND CONSTITUTION,
  WE ARE DEMANDING TO RESPECT OR STAND ON YOUR ANNOUNCEMENT DATED 09-12-2009
  DONT VIOLATE INDIAN CONSTITUTION, YOU MUST RESPECT, OBEY INDIAN CONSTITUTION….
  TELANGANA IS NOT A LAW AND ORDER PROBLEM, ONLY HUMAN RIGHT PROBLEM, DONT SEE AS A LAW AND PROBLEM, SEE HUMAN RIGHT PROBLEM………

 4. Goutham Navayan
  September 20, 2011

  జయ వింధ్యాల గారూ
  సోనియా గాంధీకీ, కోర్‌ కమిటీ సభ్యులకు చేసిన మీ విజ్ఞప్తి చాలా బాగుంది.
  వాళ్లకి నిజంగా ఏమాత్రమైనా ప్రజాస్వామిక విలువలు, ఇంగిత జ్ఞానం వున్నట్టయితే తప్పకుండా ఈ విజ్ఞప్తి చూస్తే తప్పక ఆలోచిస్తారు. చూసినా చూడకపోయినా మనమంతా మనవంతు బాధ్యతగా ఇలాంటి లేఖలు వారికి పోస్ట్‌ చేస్తే బాగుంటుంది.

  అట్లూరి గారూ
  టీడీపీ, కాంగ్రెస్‌ పార్టీలలోని తెలంగాణా నేతలను మీరు వెనకేసుకొచ్చిన తీరు సమంజసంగా లేదు. వాళ్లకి తమ పార్టీలను కాదంటే టీఆర్‌ఎస్‌లో చేరడం తప్ప వేరే మార్గం లేదనడంలో కూడా అర్థంలేదు.
  తెలంగాణా సమస్యను అనేక ఇతర సమస్యల్లో ఒకటిగా చూస్తున్నారా లేక తెలంగాణా ప్రజల జీవన్మరణ సమస్యగా భావిస్తున్నారా అనే దానిని బట్టి వాళ్ల కార్యాచరణ వుంటుంది.
  ఇప్పటివరకూ వాళ్లు పైపై డైలాగులూ, రాజినామాల డ్రామాలే తప్ప తెలంగాణా ప్రజల ఆకాంక్షను సీరియస్‌గా తీసుకుని ప్రజలతో కలసి ఉద్యమించిన దాఖలాలు లేవు.
  తెలుగుదేశం వాళ్లు రాజినామాలు చేసిన వెంటనే తమ పసుపు పచ్చ జండాలు భుజాన వేసుకుని, చంద్రబాబు ఫొటో నెత్తిమీద పెట్టుకుని పొలో మంటూ బస్సు యాత్రకు బయలుదేరారు. పసుపు పచ్చ జెండా, చంద్రబాబు నాయుడి బొమ్మా ప్రజలకు ఏం భరోసా యిస్తున్నాయి? తెలంగాణా సాధిస్తామనా??? అయినా తెలంగాణా ప్రజలు పోనీలే రాజినామాలైతే చేశారు కదా అని వాళ్లకి నీరాజనాలు పట్టారు. కానీ సీమాంధ్ర స్పీకర్‌ అప్రజాస్వామికంగా కాంగ్రెస్‌, టీడీపీ నేతల రాజినామాలన్నీ కట్టగట్టి తిరస్కరించిన తరువాత వాళ్లు చేస్తున్న వాదనేమిటి? కాంగ్రెస్‌ వాళ్లు మళ్లీ రాజినామాలు చేస్తే మేం చేస్తాం…. లేకుంటే చెయ్యం… అంటూ ప్రజల ఆశల మీద నీళ్లు చల్లుతున్నారు.
  ….2డి చంక దిగకుండా, సగం జెండా జై సమైక్యాంధ్ర అంటుంటే ఆ జెండాను పట్టుకుని తెలంగాణా ప్రజల విశ్వాసాన్ని ఎట్లా చూరగొంటారు??
  కాంగ్రెస్‌ పార్టీలోని తెలంగాణా నాయకులు ఆడుతున్నది కూడా ఇదే డ్రామా కదా. పది మంది ఎమ్మెల్యేలతో టీఆర్‌ఎస్‌ తెలంగాణా ఉద్యమాన్ని శాసిస్తూ యావద్దేశాన్ని ఆకర్షిస్తుంటే దానికంటే రెండింతలు కాకలుతీరిన నేతలున్న ఈ రెండు పార్టీలూ నిజాయితీ లేకనే కదా చతికిల బడి ఊరికే కెసిఆర్‌ను తిట్టుకుంటూ చవట దద్దమ్మల్లా కాలం వెళ్ల దీస్తున్నాయి.
  నేను టీఆర్‌ఎస్‌/కెసిఆర్‌ అభిమానినేం కాదు అయినా అంటున్నాను…
  పోయేకాలం టీడిపీ/కాంగ్రెస్‌లది… రాబోయే కాలం టీఆర్‌ఎస్‌ది/తెలంగాణా ప్రజలది!

 5. Goutham Navayan
  September 20, 2011

  ….
  ఆ జెండాను పట్టుకుని తెలంగాణా ప్రజల విశ్వాసాన్ని ఎట్లా చూరగొంటారు??
  కాంగ్రెస్‌ పార్టీలోని తెలంగాణా నాయకులు ఆడుతున్నది కూడా ఇదే డ్రామా కదా. పది మంది ఎమ్మెల్యేలతో టీఆర్‌ఎస్‌ తెలంగాణా ఉద్యమాన్ని శాసిస్తూ యావద్దేశాన్ని ఆకర్షిస్తుంటే దానికంటే రెండింతలు కాకలుతీరిన నేతలున్న ఈ రెండు పార్టీలూ నిజాయితీ లేకనే కదా చతికిల బడి ఊరికే కెసిఆర్‌ను తిట్టుకుంటూ చవట దద్దమ్మల్లా కాలం వెళ్ల దీస్తున్నాయి.
  నేను టీఆర్‌ఎస్‌/కెసిఆర్‌ అభిమానినేం కాదు అయినా అంటున్నాను…
  పోయేకాలం టీడిపీ/కాంగ్రెస్‌లది… రాబోయే కాలం టీఆర్‌ఎస్‌ది/తెలంగాణా ప్రజలది!

 6. Goutham Navayan
  September 20, 2011

  సారీ , కామెంట్ చాలా పెద్దది అవడం తో పోస్ట్ చేయడం లో కొంత ఇబ్బంది పడ్డాను.
  ……………………………
  జయ వింధ్యాల గారూ
  సోనియా గాంధీకీ, కోర్‌ కమిటీ సభ్యులకు చేసిన మీ విజ్ఞప్తి చాలా బాగుంది.
  వాళ్లకి నిజంగా ఏమాత్రమైనా ప్రజాస్వామిక విలువలు, ఇంగిత జ్ఞానం వున్నట్టయితే తప్పకుండా ఈ విజ్ఞప్తి చూస్తే తప్పక ఆలోచిస్తారు. చూసినా చూడకపోయినా మనమంతా మనవంతు బాధ్యతగా ఇలాంటి లేఖలు వారికి పోస్ట్‌ చేస్తే బాగుంటుంది.

  అట్లూరి గారూ
  టీడీపీ, కాంగ్రెస్‌ పార్టీలలోని తెలంగాణా నేతలను మీరు వెనకేసుకొచ్చిన తీరు సమంజసంగా లేదు. వాళ్లకి తమ పార్టీలను కాదంటే టీఆర్‌ఎస్‌లో చేరడం తప్ప వేరే మార్గం లేదనడంలో కూడా అర్థంలేదు.
  తెలంగాణా సమస్యను అనేక ఇతర సమస్యల్లో ఒకటిగా చూస్తున్నారా లేక తెలంగాణా ప్రజల జీవన్మరణ సమస్యగా భావిస్తున్నారా అనే దానిని బట్టి వాళ్ల కార్యాచరణ వుంటుంది.
  ఇప్పటివరకూ వాళ్లు పైపై డైలాగులూ, రాజినామాల డ్రామాలే తప్ప తెలంగాణా ప్రజల ఆకాంక్షను సీరియస్‌గా తీసుకుని ప్రజలతో కలసి ఉద్యమించిన దాఖలాలు లేవు.

  తెలుగుదేశం వాళ్లు రాజినామాలు చేసిన వెంటనే తమ పసుపు పచ్చ జండాలు భుజాన వేసుకుని, చంద్రబాబు ఫొటో నెత్తిమీద పెట్టుకుని పొలో మంటూ బస్సు యాత్రకు బయలుదేరారు. పసుపు పచ్చ జెండా, చంద్రబాబు నాయుడి బొమ్మా ప్రజలకు ఏం భరోసా యిస్తున్నాయి? తెలంగాణా సాధిస్తామనా??? అయినా తెలంగాణా ప్రజలు పోనీలే రాజినామాలైతే చేశారు కదా అని వాళ్లకి నీరాజనాలు పట్టారు. కానీ సీమాంధ్ర స్పీకర్‌ అప్రజాస్వామికంగా కాంగ్రెస్‌, టీడీపీ నేతల రాజినామాలన్నీ కట్టగట్టి తిరస్కరించిన తరువాత వాళ్లు చేస్తున్న వాదనేమిటి? కాంగ్రెస్‌ వాళ్లు మళ్లీ రాజినామాలు చేస్తే మేం చేస్తాం…. లేకుంటే చెయ్యం… అంటూ ప్రజల ఆశల మీద నీళ్లు చల్లుతున్నారు.

  నిజానికి వాళ్లలో ఏమాత్రం నిజాయితీ వున్నా చేయాల్సిందేమిటి? ప్రజలతో కలసి ఉద్యమించడం. దానికంటే ముందు తాము పట్టుకున్న జెండా, తమ నాయకుడు తెలంగాణాపై స్పష్టమైన వైఖరి తీసుకునేలా ఒత్తిడి తేవడం. ఒకే జెండా ఇక్కడ జై తెలంగాణా… అక్కడ జై సమైక్యాంధ్ర అనడం హాస్యాస్పదం. అది నీతి, నిబద్ధత, ప్రజాస్వామిక విలువలు లేని పార్టీలు అనుసరించే పద్ధతి అని తిరుగబడటం. లేదంటే తెలంగాణా తెలుగుదేశం ఫోరం అని కాకుండా తెలంగాణా తెలుగుదేశం పార్టీ అని పేరుపెట్టుకుని సొంత జెండా, సొంత ఎజెండాతో ముందుకు సాగడం. ఇవేవీ చేయకుండా జై తెలంగాణా అని మనస్ఫూర్తిగా అనలేని, ఆ పదాన్ని ఉచ్ఛరించడానికే హెజిటేట్‌ చేసే ఆంధ్ర నాయకుడి చంక దిగకుండా, సగం జెండా జై సమైక్యాంధ్ర అంటుంటే ఆ జెండాను పట్టుకుని తెలంగాణా ప్రజల విశ్వాసాన్ని ఎట్లా చూరగొంటారు??
  కాంగ్రెస్‌ పార్టీలోని తెలంగాణా నాయకులు ఆడుతున్నది కూడా ఇదే డ్రామా కదా. పది మంది ఎమ్మెల్యేలతో టీఆర్‌ఎస్‌ తెలంగాణా ఉద్యమాన్ని శాసిస్తూ యావద్దేశాన్ని ఆకర్షిస్తుంటే దానికంటే రెండింతలు కాకలుతీరిన నేతలున్న ఈ రెండు పార్టీలూ నిజాయితీ లేకనే కదా చతికిల బడి ఊరికే కెసిఆర్‌ను తిట్టుకుంటూ చవట దద్దమ్మల్లా కాలం వెళ్ల దీస్తున్నాయి.
  నేను టీఆర్‌ఎస్‌/కెసిఆర్‌ అభిమానినేం కాదు అయినా అంటున్నాను…
  పోయేకాలం టీడిపీ/కాంగ్రెస్‌లది… రాబోయే కాలం టీఆర్‌ఎస్‌ది/తెలంగాణా ప్రజలది!

 7. Srinath
  September 21, 2011

  Sri,

  I really appreciate your efforts to understand Telangana movement.
  First and foremost is, Telangana (Called Hyderabad) when tried to merge with Andhra State in 1956. Telangana people at large opposed the proposal. Central govt led by Pt. Nehru came up with conditional based merger. Conditions were called Mulki rules, 6 point formula to protect the interests of Telangana. All these conditions were never met. So this de-merger is necessary.
  You may ask why do we need these conditions? Here is the fact: Andhra state was ruled by Democratic British and Telangana was ruled by a monarch ruler and left Telanganites illiterate and away from politics.
  You know what will happen if there are two people, one with experience and other without experience.. same happened between Andhra and Telangana.
  People from Andhra could be as CM for full terms and Telangana politicians couldn’t stand infront of Andhra cunning leadership (best example is Chenna Reddy vs YSR)
  6.5 years when Telangana people became CM there were busy saving their positions.
  I can take each department or section and tell how Telangana was at loss by merging with Andhra.

  Anyways, Now the division is clear and the unrest continues till the Telangana state is formed. This is not in hands of KCR or KTR as they didn’t start this and they are no one to end this..If not KCR it would have been some other person.

  Thanks,
  Srinath

  • atluris
   September 21, 2011

   Thanks for the information Srinath garu. TG politicians must take the blame for backwardness. In democracy politicians can’t escape by saying they got bullied by other politicians.

 8. venkata Ratnakar Koneru
  September 25, 2011

  I agree, Atluris comment. We elected politician for representing in a common house of people’s representative. However if that politician sleeps and is not involved in doing the perfect evaluation and situation by use of all those IAS and state secretaries, then he us useless. The mistake would be ours and an expensive mistake for 5 years by us. Well, there we got at least 5% of under development already in last 100 years. I am sure, that we might have made such a mistake either by not taking part in elections or choosing a wrong candidate at least 5 or 6 times. which means we are 30 years backward to other regions where people might have made correct choices of their representatives.

  for all those who are arguing that the “migrant seema andhra” leaders have looted us, don’t forget one fact- we are a secular and independent country, we can move to any state or region in the whole country. What if telangana is formed , how can one guarantee, that the nizamabad people are not being looted by industrially developed warangal people or by highly metropol hyderabad. Will all these groups start coming back and fight for seperate nizamabad etc.

  The thinking here is not entirely correct. We should be as one, like always ” Andhra Pradesh”. We know telangana is underdeveloped. a special quota should be allocated to telangana and then as stated in the initial “Naa Parishkaram”. A commitee should be arranged to monitor the situation. and this committee and hierarchy should be like a circle.

  Damn it, we are trying to break into pieces, don’t forget this will form a base for more splitting in future. We had great power in whole country in determining the central politics. Do everyone think that we are still going to have it? Will we be able to argue for all those funds for projects(keeping aside how well they are used internally in the state with out any scams)?
  No, not at all.

  This is a great opportunity we are creating for politicians to scam more more with more new projects.

  ” Mana intlo chinna tagada jarigindi ani illu padagottu kuntama?”

  basic common sense – Lets be united and there are easy ways to solve by revolution in elections. Democracy is for people, by the people and to the people, not for the politicians, by the politicians and to the politicians..

  Thank you for giving this opportunity..

  Venkata Ratnakar Koneru
  Indian!!!

  • atluris
   September 27, 2011

   Well said. Before TG people blame Andhra politicians, they should catch the collars of their own elected representatives. Politicians are looting everywhere irrespective of the region. TG issue underlines the need for more participation of citizens in election process.

 9. Pingback: Andhra Aspirations « Politics and Personal

 10. Sripal Sama
  October 27, 2011

  I liked the article. The way you briefly separated out different aspects is good. The solution is very good.

 11. Kiran Dasari
  October 27, 2011

  mothaniki sri gaaru anyayam jarigindi kaneesam konni visayaallonaina angeekarinchinanduku santhosham.. anthe kaadu.. anyaayam jaringindi, inthakanna em cheppalenu antooone, teliyadu ani bracket lo chepthu maree mee seeemaandhra sailini bayatapettukunnaru.. article lo diversion full ga kanipistondi. samaikyaandhra konam vachina telangana supported article ga nenu angeekaristaa… e issue lo aithe konchem equality undo aa issues ni highlight chesi, ekkuva anyaayam jarigina issues lo maathram jarigindi ani cheptuuune, teleedu antu thappinchukuntuunaav.. idi neelo anthargathamga unna samaikyandhra gunam…. grt..

  cheppakane chepthunnadi ide ide premani…

  • atluris
   October 27, 2011

   haha….na “teliyadu” ni apardham chesukunnaru anukunta. Neenu annadi…anyayam jarigindo ledo teliyadu ani kaadu….anyayam jarigindi, naaku anthaku minchi emi teliyadu ani. In other words, it is agreeing without any condition (ifs and buts). Besharathu gaa, Nirdvandham gaa voppukuntunnatlu.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

Information

This entry was posted on September 19, 2011 by in History, Personal, Telugu.
%d bloggers like this: