A little personal and a little political

తెలంగాణా ఉద్యమం, లోక్ సత్తా పరిష్కారాలు – కే.గీత మూర్తి

స్వాతంత్రం వచ్చి ఆరు దశాబ్దాలు దాటినా అభివృద్దికి నోచుకోని ప్రాంతలున్నయంటే మనం సిగ్గు
పడాల్సిందే. ఇప్పటికి అన్ని ప్రాంతాల్లో కనీసం మంచినీటి వసతి,విద్య,వైద్య సదుపాయాలు లేక జనం అల్లది పోతున్నారంటే అది ఏ ప్రాంతం అని లేదు అన్ని చోట్ల ఇదే సమస్య.కేవలం సీటు రాజకీయాలు,వోట్ రాజకీయాలే దీనికి కారణం.ఎన్నికలు అనగానే ప్రజలను ప్రోలోభ పెట్టడానికి కోట్లు కర్చుచేయ్యడం.అంతకు వంద రెట్లు సంపదించడమే లక్ష్యంగా పెట్టుకున్నప్పుడు అసలు సమస్యలు గుర్తించడంలో,వాటిని పరిష్కరించడం లో మనం ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు వున్నారా?అని ఆలోచించాల్సిన అవసరం వుంది.అసలు ఎన్నికలు పార్టీల కోసమా?ప్రజల కోసమా?అన్న విషయం ఆలోచించాల్సిన బాధ్యతా అన్నివర్గాల పైన వుంది..మనకు రాజ్యాంగం ఏర్పడి ఎన్నికలు జరుగుతున్నపడి నుండి చుస్తే మన రాష్ట్రంలో 294 నియోజకవర్గాల్లో MLA లు ఏమి చేస్తున్నారు?42 మంది MP లు ఏమి చేస్తున్నారు? వారి వారి నియోజకవర్గాల్ల్లో అభివృద్ధి కోసం కేటాయించిన నిధుల గురించి గాని, సమస్యల గురించి గాని పట్టించుకుఉంటునార? ఎంతో ఉన్నతమైన వేదిక లైన అసెంబ్లీ, పార్లౌమేంట్ లో శాంతి యుతమైన చర్చలు జరిగే ఆస్కారం లేదా?సామాన్యమైన వారి ప్రయోజనాలకు తూట్లు పదాల్సిన్దేనా?

ఒక చేత్తో వోట్ వేసి ఇంకో చేత్తో పన్నులు కట్టి మా సమస్యలను గల్లి నుండి ఢిల్లీ వరకు వినిపించండి అని ఎన్నుకున్న ప్రజలకు ఎం సమాధానం చెప్తారు. మీకు వేదికలుగా ఇచిన వాటిలో చర్చలు జరపకుండా రోడ్ల పైన వాగ్వాదాలు జరుపుకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయా?మన అందరికి మంచి పరిష్కారం,చూపడానికి మనకు మన రాజ్యాంగం వుంది. దాని పరిదిలో మనం పరిష్కారం చూడనప్పుడు మనం రాజ్యాంగాన్ని గౌరవించినట్టు అవుతుందా?ప్రస్తుతం ప్రతి ఒక్కరి జీవన విధానానికి సంక్లిష్ట పరిస్తితి ఎదుర్కుంటున్న వారికీ ఇది ఒక్క పెద్ద పరీక్షా అయింది.2009 డిసెంబర్ 7 న అన్ని రాజకీయ పార్తినలను అప్పటి ముక్యమంత్రి రోశయ్య గారు ఏర్పాటు చేసిన సమావేశం లో ఒకటి రెండు పార్టీలు మినహా మిగతా పార్టీ లు అనుకూలం అని చెప్పి వోట్ బ్యాంకు కోసం తెలంగాణకు కట్టుబడి వుంతయన్నై.Dec 9 ప్రకటన రాగానే అంతవరకు ప్రజలను మబ్య పెట్టిన కాంగ్రెస్ tdp శాసనసభ నేతలు కొన్ని గంటల్లోనే రాజీనామాలు చేసి ప్రజల ముందు నిలబడ్డారు.తెలంగాణా రావాలంటే అసెంబ్లీ లో ఆమోదం పొందాలి కదా అని రోశయ్య అంటే విస్తృత ఏకాభిప్రాయ సాధన లేకుండా తీర్మానం ముందుకు రాదనీ తప్పించు కోవాలని చూస్తున్నారు.ఇక్కడ కాంగ్రెస్ tdp రెండు వికృతమైన తోడేళ్ళ లాగా ప్రవర్తించి. ఈ రెండు తోడేళ్ళు సామాన్య ప్రజలిఅని ఎలా తినాలి అని పోతిపడ్డై.

ఆంధ్రప్రదేశ్లో ఏడాదిన్నరగా విచిత్ర పరిస్తితి నెలకొంది.ఒక ప్రాంతం లోని వారు తెలంగాణా కావాలన్తుంటే ,ఇంకో ప్రాంతం వారు సమైక్యం గ వుండాలని కోరుకుంటున్నారు.దీంతో రాష్ట్రం లోని ప్రధాన పార్టీ లు పాలన వ్యవస్తను మరింతగా జటిలం చేస్తున్నై.అధికార,ప్రతిపక్ష పార్టీ నేత ఏ ప్రాంతానికి సంబందించిన వారు ఆ ప్రాంతం కావాలని వధ ప్రతివాదాలు చేస్తున్నారు.రాజీనామాలు చెయ్యడం వెనక్కి తీసుకోవడం ఒక ఆట లాగ అయ్యింది.రాజీనామాలు అంటే చిన్నపిల్లలు సైతం నవ్వే పరిస్తితి వచ్చింది.అంటే మన నేతలు వ్యవహరిస్తున్న తీరు చుడండి.అసలు ఏ ప్రాంతం కావాలన్న ఆ ప్రాంతం యొక్క సమస్యలు అక్కడే పరిష్కారం చేసుకోవచాన్న బాధ్యత మరిచి పోతే ఎలా ?అసలు శాసనసభ లో ఈ విషయాల పయ్ చర్చలు జరుగ లేదు. తెలంగాణా విషయానికి వొస్తే 1969 లో ఒక రాజకీయ డిమాండ్ గా మొదలయ్ 40 ఏళ్లుగా కొన సాగుతుంటే దీన్ని ఏ మాత్రం పరిష్కరించేందుకు ప్రయత్నించకుండా ఎవ్వరి లాభం వాళ్ళు చూసుకొంటూ అన్ని రాజకీయ పార్టీలు ప్రవర్తించాయి. వీరంతా చేసింది వోట్ బ్యాంకు రాజకీలు సీట్ల కోసం అనడం లో ఎలాంటి సందేహం లేదు.ఇలా చేసిన వీరంతా చరిత్ర ముందు దోషులుగా నిలబడాల్సిందే.ఈ ప్రాంతీయ అసమానతలని అడ్డం పెట్టుకొని బంద్ లు రాస్తా రోఖోలు, ధర్నా లు బస్సులు తగలబెట్టడం, అద్దాలు పగలగొట్టడం, ప్రభుత్వ ఆస్తులు ద్వంసం చెయ్యడం ద్వారా తమ ఉనికిని కాపాడుకునే ప్రయత్నాలు చెయ్యడం వలన సామాన్యమైన ప్రజల మీద ఇది అదనపు భారం పడడమే కాకుండా, ప్రజల్ని ముక్యంగా విద్యర్తులని, చదువులని ఇబ్బంది పెడ్తున్న సమస్య. అసలు ఈ సమస్యకి ఏ రకంగా పరిష్కరించుకుందాం, ప్రజలు ఇచ్చిన అధికారంతో విజ్ఞతతో ఎలా వ్యవహిరిడ్డం అని కనీసమైన ఆలోచన లేక పోవడం విచారకరం. నిజంగా మన నేతలు చెయ్యాలనుకుంటే ౬ సుఉత్రాల పథకం లో రాష్ట్ర ప్రణాళిక బోర్డు ని ఎందుకు ఏర్పాటు చెయ్యలేదు?610 జి.ఓ ని ఎందుకు నిజాయితిగా అమలు చేయలేదు? ఈ విష్యం పాలకులు ఆలోచించాలి.దీని వెనక వికృత రాజకీయ క్రీడ ను ప్రతి ఒక్కరు ఆలోచించాలి.పరిష్కారం చెప్పాల్సిన పెద్దలు ఏ భావం వ్యక్తం చేసిన ఆ ప్రాంతానికి వ్యతిరేకి అన్న ముద్ర పడ్తుందేమో అనే భయం తో లోపల ఒక మాట, బయట ఇంకో మాట, అధికారం లో వుంది చర్చించని వారు కూడా మేము మద్దతు నిస్త మని కూడా చెప్పి అప్పటి పుటకు సరిపెద్టు కాలయాపన చేస్తున్నారు. అస్సలు రాష్ట్రం లో రాజకీయ పార్టీల బాధ్యత లేదా? రాష్ట్రం సమస్యను రాష్ట్రం లో పరిష్కరించలేని పేలవమైన బలహీనమైన నాయకత్వాన్ని ప్రజలు ఎనుకున్నర? అనిపిస్తుంది.ఇక్కడ అన్ని రాజకీయ పార్టీలు బాధ్యతను విస్మరించి. సూదితో పొయ్యే దాన్ని గొడ్డలి ఉపయోగించే స్తితికి పార్టీలు చేసి. ఇప్పుడు కేంద్రం పేరుతో కాలయాపన చేస్తున్నై.రాష్ట్రం లో చర్చించకుండా, సైదంతికంగా లాభమా ?నష్టమా ? ప్రజల ప్రయోజనాలక? అనే అంశాలను కూడా కాదు, అవతలి వారు చెప్పిన మాటలను ఇవతలి వారు ఆలోచించడం, అభిప్రయల్యు తెలుసు కోవడం అన్న ఆలోచనలు కూడా కలగక పోవడం విచారకరం.

చదువులు అందడం లేదు, నీళ్ళు పోతున్నై, ఉద్యోగాలు పోతున్నై,ఆంధ్రావాల గో బ్యాక్ అని వీరు అంటే,తెలంగాణా కబర్దార్ అంటూ రకరకాla తిట్లు లేదా మేము చెప్పిందే కరెక్ట్ అని అనడం ఈ ప్రాంతాల వారు ఆ ప్రాంతాల వారి ఏరియా లో తిరగాన్నివం, ఇళ్ళ పైన దాడులు చేస్తాం, కభార్ధర్ అనే బెదిరింపు దొరనులు మంచివి కావు.నాయకులు మాట్లుడుతున్న బాష ,ప్రవర్తించే తీరు ఆవేశం లో వున్నా యౌవత మీద ప్రభావం ఉంటుందన్న కనీస జ్ఞానం కూడా లేక పోవడం, యువత అనుకరించడం వలన అమాయకమైన నిరుపేద యువత నష్టపోతున్నాం. ఏ ప్రాంతం నాయకులైన వారి పిల్లలను ఉద్యమాల్లో ఉంచారు. వారి పిల్లలు హాయిగా చదువుకుంటున్నారు. ఇక్కడ కాకపోతే విదేశాలలో, ఎక్కడైనా ఒక్క నాయకుడు దెబ్బ తిన్న పాపాన పోలేదు. చదువులు నష్టపోయి,భవిష్యత్తు అంధకారం అయితే ఈ నాయకులు ఆడుకున్తరన్న భరోసా ఏముంది. క్షణం లో ప్లతే ఫిరాయించే వీరు రేపటి గురించి అలోచిస్తారనే నమ్మకం వుందా?
పుట్టిన ప్రతి బిడ్డ ఎదిగే అవకాశం కల్పించాలి అంటే వివక్షత లేని సమాజం రవళి. విద్య, వైద్యం , ఉపాది న్య్పున్యాలు కల్పించి వారి కాళ్ళమీద వారు నిలబడే అవకాశాలు కల్పించినట్లితే ఈ అసమానతలు పోతై కదా? అసలు మన రాజకీయాలు ఎప్పుడన్నా వీటి గురించి అలోచిన్చాయ? ఎన్నికల్లో మద్యం , డబ్బు పంచడం తప్ప ఇంకా ఎమన్నా ఆలోచించే దిశగా వీరు వున్నారా?అన్ని రాజకీయ పార్టి ల లాగా లోక్ సత్తా సమస్య లో బాగం కాదు ఎప్పుడు పరిష్కారం వైపు ఆలోచిస్తుంది. రాజకీయం అంటే వ్యాపారం కాదు. రాజకీయం అంటే సేవ అనే లక్ష్యం లో లోక్ సత్తా వచ్చింది. ఈ అవినీతి,ధన, కుటుంభ,వారసత్వ,దోపిడీ రాజకీయాలను మార్చాలనే లక్షం తో లోక్ సత్తా వచ్చింది. లోక్ సత్తా జాతీయ సమైక్యత కోసం జాతీయ స్తాయిలో రాజకీయ ప్రక్షాళన కోసం వచ్చిన పార్టీ. అందుకే లోక్ సత్తా దృష్టి లో దేశం లో అన్ని రాష్ట్రాలు సమానమే. అందుకే ఏ రాష్ట్రం ఏర్పడ్డ దానికి కావాల్సిన విధానాలు ఏమిటో చెప్తుంది.

లోక్ సత్తా చూపిస్తున్న పరిష్కారాలు ఇవి వీటికోసం పోరాటం చేస్తుంది.

ప్రజలని బిచాగాల్లు గా చూసే రాజకీయం నుండి , ప్రజలకి అధికారం ఇచే రాజకీయ వ్యవస్త రావాలంటే రాజకీయ ప్రక్షాలన తో పాటు కేంద్రీకృత పాలనలో ప్రాంతాలు విడిపోయిన, కలిసి వున్నా అభివృద్ధి సున్నా, అన్న సంగతి గుర్తు పెట్టుకోవాలి. ఇందు కోసం ప్రతి జిల్లా లో ఎన్నికైన జిల్లా కౌన్సిల్ ని ఏర్పాటు చేసేలా 371 -d లో మార్పులు చేసి, రాజ్యాంగం 11 ,12 వ శేడుల్ లోని అధికారాలు ఇచ్చి , జిల్లా స్తాయిలో,వార్డు -గ్రామస్తాయిలో ప్రజలకే తలసరి గ్రాంట్, అధికారాలు ఇచ్చే ఏర్పాటు చెయ్యాలి. ప్రాంతీయ అసమానతలు వికృత స్తాయికి చేరుకోవడానికి మితిమీరిన కేంద్రీకృత వ్యవస్థ తో పటు స్తానిక ప్రభుత్వాలను నిర్వీర్యం చెయ్యడం ప్రధాన కారణం.1960 నుండి ఆంధ్ర ప్రదేశ్ లో స్తానిక ప్రభుత్వాలు సత్తా కోల్పోతున్నై. 73 ,74 వ రాజ్యాంగ సవరణ వచ్చిన సాధికారత అమలులోకి రాలేదు. ఇలా చెయ్యడం వలన గల్లి సమస్యలు ఢిల్లీ వరకు కాకుండా జిల్లా లోనే పరిష్కారం అవుటై. అవినీతి తగ్గుతుంది. పరిపాలన సవ్యంగా వుంటుంది. ప్రజలందరి ఆద్వర్యం లో జరుగుతుంది కాబట్టి అభివృద్ధి సాద్యం.

2 .14 ఎఫ్ ని తొలగించాలి అని కోరుతూ అసెంబ్లీ లో తీర్మానం చెయ్యాలని అందరిని ప్రయోజనాలను సమన్వయము చెయ్యడమే రాజకీయ ప్రధాన లక్ష్యమని , రాజ్యాంగ బద్దంగా ఆ కర్తవ్యాన్ని జయ ప్రకాష్ నారాయణ్ నెరవేర్చారు. హైడ్రాబాదు ఫ్రీజోనే అంటూ వివాదం చెలరేగినప్పుడు అఖిలపక్ష సమావేశం లో జీపి మినహా అన్ని పార్టీలు అబద్దం చెప్పయంటూ సాక్షాత్తు తెలంగాన రాష్ట్ర సమితి అధ్యక్షుడు చంద్ర శేఖర్ రావు పలు బహిరంగ సభల్లో చెప్పారు. ఫ్రీజోనే విష్యం పై సుప్రేం కోర్ట్ వెళ్ళడం వాళ్ళ ఫలితం ఉండదని, రాష్ట్రపతి ఉతర్వుల్లోని 14 ఎఫ్ తొలగించాలని కొతుతూ అసెంబ్లీ లో తీర్మానం చెయ్యాలని లోక్ సత్తా తరపున ప్రవేశ పెట్టడానికి అనుమతి నివ్వాలని కోరారు. 14 ఎఫ్ నిబందన తొలగడానికి లోక్ సత్తా నే కృషి చేసిందన్న సంగతి ఎలా మరిచి పోయారు. మొన్నటి మల్లి 14 ఎఫ్ నిబందన కోసం మల్లి ప్రధాన మంత్రి కి కూడా లేఖ రాయడం మరిచి జెపి సమైక్య వాడి అనే ముద్ర వేస్తె చాలని తెరాస ప్రయత్నం చేస్తుంది. ఆంధ్ర ప్రాంతం లో కూడా తెలంగాణా వస్తే మీకేంటి కష్టం అని, 14 ఎఫ్ విషయాన కుడా ఆంధ్ర ప్రాంతం లో గట్టిగ చెప్పింది లోక్ సత్తా.పూటకో మాట మార్చే రాజకీయం లోక్ సత్తా నరనరాన లేదని తెరాస తో సహా అన్ని పార్టి లు తెలుసుకోవాలి.
౩. తెలంగాణా సహా రాష్ట్ర వ్యాప్తంగా సంస్కోభం తో నలిగి పోతున్న రైతుల సమస్యలు పరిష్కారానికి స్వతంత్ర రైతు సంగాలతో కలిసి పార్టీలకు అతీతం గా ఏకం చేసి పోరాడుతుంటే, దశాబ్దాలపాటు అధికారం లో వుండి ,అధికారం లో వున్నా కూడా తెలంగాణా ని పట్టించుకోని నేతలు అర్థ రహిత ఆరోపణలు చేస్తూ ప్రజలను పక్క దోవ పట్టిస్తున్నారు.ప్రజా సమస్యల పరిష్కారానికి MLA నిధులని సక్రమంగా ఖర్చు చెయ్యని , కనీసం సొంత నియోజక వర్గం లో సరైన మార్కెట్ యార్డ్ లేక ,అందుబాటులోకి తెచే ప్రయత్నం, చెయ్యని హరీష్రావు గారు సిద్దిపేట లో మార్కెట్ యార్డ్ అడ్రస్ చెప్పగలరా?
తెలంగాణా లోని పట్టి రైతు లకి కుఇన్తలుకి ౩౦౦౦/- నుండి 7000 /- ధర లభించింది కేవలం లోక్ సత్తా వల్లనే.సిద్దిపేట లో వున్నా మార్కెట్ యార్డ్ లో కనీస సదుపాయాలు లేక, ఊరికి అవతల వున్నా కొత్త మార్కెట్ యార్డ్ ప్రారంబానికి నోచుకోక పోవడం వలన రైతులు పెద్దపల్లి మార్కెట్ యార్డ్ వెళ్ళాల్సి అవస్తలు పడ్తుంటే జెపి మెదక్ జిల్లా రైతు యాత్ర లో ప్రభుత్వం, అధికారులతో మాట్లాడి మార్కెట్ యార్డ్ ని తెరిపించారు. ఇప్పుడు మార్కెట్ యార్డ్ రీతులకు అందుబాటు లో వుండి.

౪.నవాబు పేట లో ని కంకర మల్లేశం అనే రైతు కూలీలు దొరకక పంటను తగలపెట్టిన విషాదాన్ని అసెంబ్లీ ద్రుష్టి కి తెచ్చి పార్టీ తరపున ఆర్టిక సహాయం అందించారు.
౫.రంగారెడ్డి జిల్లా లో ఉపాద్యాయుల బదిలీలు రాజ్యాంగ విరుద్దమని అడ్డుకున్నది లోక్ సత్తా నే.
౬.గోదావరి జలాల్ని కరీంనగర్ జిల్లా ఎల్లంపల్లి నుంచి హైదరాబాద్ తరలించకుండా ఆ నీటిని కరీంనగర్ చుట్టుపక్కల జిల్లాలో ఉపయోగించి , హైదరాబాద్ కి కృష్ణ నది ౩ వ దశ పతాకాన్ని చేపట్టాలని నగరం లో ని 23 మంది MLA ల ను సమీకరించి పోరాటం చేస్తుంది లోక్ సత్తా పార్టీ.

౭.గోదావరి జలాల్ని కృష్ణ నది లోకి మళ్ళించి కృష్ణ జలాలను ప్రధానంగా తెలంగాణా, రాయలసీమ జిల్లాలోని మెట్టా ప్రాంతాలకు వినియోగించాలని లోక్ సత్తా చెప్తుంది.
౮.2009 కృష్ణ వరదలు వచినపుడు ప్రభుత్వ సయం లేకుండా లోక్ సత్తా పార్టీ మహబూబ్నగర్ జిల్ కేశవరం గ్రామాన్ని దత్తత తీసుకొని కక్కడ తక్షణ అవసరాలని అందించడమే కాకుండా స్కూల్ నిర్మాణం చేసింది.కృష్ణ వరదలు భావిష్యతులో నష్టం రాకుండా కనీసం 25 లక్షల కుసెకుల వరద నీటిని తట్టుకునేల కరకట్టల నిర్మాణం చేయాలనీ, జాతీయ విపతుల సహాయ దళాన్ని రాష్ట్రం లో ఏర్పాటు చెయ్యాలని jp స్వయానా ప్రధాన మంత్రిని కలిసి చెప్పిన తర్వాత ప్రభుత్వం ఆ దిశగా స్పందిన్చిందన్న సంగతి మరవొద్దు.
౯.తెలంగాణా విమోచన దినోతవాన్ని అధికారికంగా నిర్వహించాలి.హైదరాబాద్ సంస్తాన విముక్తి దినోస్తావాన్ని భారత స్వతంత్ర దినోస్తావానికి కొంసగిమ్పేనని, తెలంగాణా విముక్తి దినోస్తావాన్నిసెప్టెంబర్ 17 న రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని లోక్ సత్తా డిమాండ్ చేసింది. ఈ స్వతంత్రాన్ని తాకట్టు పెడ్తుంది నక్సల్స్ కాదు ,జర్నలిస్ట్ లు కాదు , రాజకీయం వ్యాపారంగా చేసి వారసత్వంగా పెంచి పోషిస్తున్న రాజకీయ నాయకులే. ఈ దోపిడీ రాజకీయాన్ని మార్చి కొత్త రాజకీయం ప్రతిస్తిన్చేదుకు తెలంగాణా విముక్తి దినోస్తవ వేడుకలు స్పూర్తినివ్వాలి అంటుంది లోక్ సత్తా.
తెలంగా పై వెంటనే తుది నిర్ణయం తీసుకోవాలని లోక్ సత్తా కేంద్రానికి ఎప్పుడో డిమాండ్ చేసింది. రాజకీయాల ప్రయోజనకోసం ఏడాదిన్నరగా సాగదీస్తూ వున్నా తెలుగు వారందరికి కేంద్రం అపార నష్టం కలిగించిందని, రాజ్యగాన్ని రక్షిస్తాం, భయం ,పక్షపాతం లేకుండా పాలనా సాగిస్తాం అని రాజ్యాగం సాక్షిగా చేసిన ప్రమాణాన్ని కేద్రంలోని పాలకులు వుల్లన్గించారని ,సరైన నిర్ణయం సహేతుకంగా తీసుకోమని ఆంధ్రప్రదేశ్ ప్రజల మనోభావాలతో ఫుట్ బాల్ అడవద్దని లోక్ సత్తా పార్టీ కేంద్రాన్ని కోరుతుంది.ఎంతటి సమస్యకైన పరిష్కారం వుందని,విస్త్రుతమైఅన , శాంతియుతమైన చర్చల ద్వారానే పరిష్కారం సాధ్యం అని అయోధ్య లాంటివి నీరుపించై .అలంటి తరహాలో మన నాయకులూ ముందుకు రావాల్సిన అవసరం వుండి. పిరికి తనాన్ని వదిలి ప్రజలను ఇంకా సంస్కోభం లోకి కాకుండా,నిజమైన ఆత్మ గౌరవం కల్పించాల్సిన బాధ్యత అన్ని రాజకీయ పార్టీ ల పైన వుందని ఇలా చెయ్యని నాయకులను పక్కన పెట్టాలని లోక్ సత్తా సూచిస్తుంది.

కే.గీత మూర్తి
లోక్ సత్తా పార్టీ అధికార ప్రతినిధి.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

Information

This entry was posted on November 18, 2011 by in Uncategorized.
%d bloggers like this: