A little personal and a little political

ఈ అసెంబ్లి సమావేశాలు మాకొద్దు…..

చిన్నప్పుడు ఒక శనివారం సాయంత్రం దూరదర్శన్ లో “ఈ చదువులు మాకొద్దు” అనే సినిమా వచ్చింది. ఆ సోమవారం మా తెలుగు సార్ క్లాస్ లోకి వచ్చిన వెంటనే, ఒక నలుగురం అదే పాట మొదలు పెట్టం, “ఈ చదువులు మాకొద్దు” అని… మా తెలుగు సార్ అంటే కొంచం అలుసు లెండి. అప్పుడు ఆయన, ఇంతకీ మీకు ఏ చదువులు వద్దూ అని అడిగే సరికి, మాకు ఏమి చెప్పాలో అర్ధం కాలేదు. వచ్చే అసెంబ్లి సెషన్కి ముందు మన రాజకీయ నాయకుల హడావిడి చూస్తుంటే అదే గుర్తువచ్చింది. శీతాకాల సమావేశాలకి ఎవరి ఎజెండా ఏమిటో మనకి క్లియర్గా తెలుస్తుంది. ఇదే ఒక సినిమా అయితే, సినిమా పేరుని చూసి క్లైమాక్స్ చెప్పేయవచ్చు. ఈ అసెంబ్లి సమావేశాల వల్ల అంధరికీ లాభమే, ఒక్క ప్రజలకి తప్ప. అది యేలాగో చూద్దాం. ఒకొక్క పార్టీ వాళ్ళు ఈ సమావేశాలని ఎలా చూస్తున్నారో చూద్దాం.

తెలుగుదేశం – అవిశ్వాస తీర్మానం: మనం తప్పకుండా అవిశ్వాస తీర్మానం పెడదాం. దీని వల్ల మన పార్టీకి చాలా లాబాలు వున్నాయి. 1) జగన్ వెనుక నిజంగా ఎంత మంది వున్నారో జనానికి చూపించవచ్చు 2) వై‌ఎస్‌ఆర్‌సి, కాంగ్రెస్ రెండూ ఒకటే అని చూపించవచ్చు 3) సి‌బి‌ఐ దర్యాప్తుని అవిశ్వాసంకి ముడి పెట్టి బేరం పెట్టవచ్చు 4) రైతుల దగ్గర మార్కులు కొట్టవచ్చు.

వై‌ఎస్‌ఆర్‌సి – మనీ, మనీ, మోర్ మనీ: తెలుగుదేశంని విజయవంతంగా రెచ్చగొట్టం. ఇక వాళ్ళు అవిశ్వాస తీర్మానం తప్పకుండా పెడతారు. కాంగ్రెస్ వాళ్ళకి మెజారిటీ లేదు కాబట్టి మన దగ్గరకి రాకుండా వుండరు. మన అన్న మీద కేసులు పడినప్పటి నుంచి డబ్బులు బయటకి రావటం లేదు కాబట్టి, అవిశ్వాస తీర్మానంలో ప్రభుత్వాన్ని నిలపెట్టటానికి ఒక్కో వోటుకి ఒక 10 కోట్లు తీసుకోవచ్చు.

కాంగ్రెస్ – రూపాయి బియ్యం: అవిశ్వాసంలో మనం నెగ్గటం ఖాయం. జగన్ వెంటావెళ్లిన తముళ్ళు కూడా తిరిగి వస్తారు. అవిశ్వాసం పేరు చెప్పుకొని రూపాయి బియ్యం గురించీ, యువకిరణాల గురించీ ఇంకో నాలుగు సార్లు వూదరగొట్టచ్చు. ప్రజా సమస్యల గురించీ మాట్లాడే వాళ్ళు వుండరు కాబట్టి, ఫుల్ టైమ్ పాస్.

టి‌ఆర్‌ఎస్ – వెకేషన్: ప్రత్యేక రాష్ట్రం పేరుతో మనం అసెంబ్లికి డుమ్మా కొట్టొచు. ప్రజా సమస్యలతో మనకి పని లేదు. ఒక వేళ అసెంబ్లికి వెళ్ళితే, యెవడైనా రాష్ట్ర విభజన మీద యెంధుకు తీర్మానం పెట్టటం లేదు అంటే ఇరుకున పడతాం.

మిగతా పార్టీలు: ఒక అరగంటో పావుగంటో మైకు దొరుకుతుంది. మనం చెప్పే సోళ్ళు అసెంబ్లిలో యెవడూ పట్టించుకోకపోయినా, న్యూస్ పేపర్లో మెయిన్ ఎడిషన్లో 3rd -4th పేజ్ లో అయినా వస్తుంది.

మీడియా – మసాలా: మనం పార్టీ కానీ పార్టీ, అందరికన్నా పెద్ద పార్టీ. ఈ సమావేశాలతో మనకి పండగే పండగ. యెక్కడ లేని మసాలా దొరుకుతుంది. టి‌ఆర్‌పి రేటింగ్స్ అదుర్స్, సేల్స్ అదుర్స్. హైదరాబాద్లోలేని విలేకరులు అందరికీ సెలవు ఇచ్చేయవచ్చు.

బాబులూ మీ డ్రామాలు మాకు వద్దు. ఈ అసెంబ్లి సెషన్లో మా సమస్యలు యెవ్వడూ పట్టించుకోడు, మీ గేమ్లు మీరు ఆడుకోవటం తప్ప. కాలేజీలో మీము కొట్టుకోవాలంటే “బయటకి పద, చూసుకుందాం” అనుకునేవాళ్ళం. మీరు కూడా అలానే బయటే చూసుకోండి మీ బాలా బలాలు. ఇప్పటికీ మా డబ్బులు తిన్నది చాలు. అసెంబ్లి నడపటానికి మా టాక్స్ డబ్బులు కర్చు చేయనవసరం.

ఈ అసెంబ్లి సమావేశాలు మాకొద్దు.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

Information

This entry was posted on November 20, 2011 by in India, Politics, Telugu.
%d bloggers like this: